ePaper
More
    Homeబిజినెస్​Tata Stock | ఆ ‘తేజ’స్సేది?.. ఇన్వెస్టర్లకు నష్టాలు మిగులుస్తున్న టాటా స్టాక్‌

    Tata Stock | ఆ ‘తేజ’స్సేది?.. ఇన్వెస్టర్లకు నష్టాలు మిగులుస్తున్న టాటా స్టాక్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tata Stock | కోవిడ్‌ తర్వాత దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల సంపదను గణనీయంగా పెంచి చాలా మందికి ఫేమస్‌ స్టాక్‌గా నిలిచిన తేజస్‌ నెట్‌వర్క్స్‌.. ఆ తర్వాత తేజస్సును కోల్పోయింది. క్రమంగా పెట్టుబడిదారుల సంపదను హరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ స్టాక్‌ ప్రైస్‌ ఆధారంగా టాటా గ్రూప్‌(Tata Group)లో అత్యంత వీక్‌ స్టాక్‌గా నిలుస్తోంది.

    టాటా గ్రూప్‌నకు చెందిన తేజస్‌ నెట్‌వర్క్స్‌(Tejas Networks) కంపెనీని 2000 సంవత్సరంలో స్థాపించారు. టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ అయిన పనాటోస్‌ ఇన్వెస్ట్‌ లిమిటెడ్‌ ద్వారా ప్రమోట్‌ చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. టెలికాం(Telecom) పరికరాల తయారీ, టెలి కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ల రూపకల్పన, అభివృద్ధి, విక్రయాలలో ప్రధాన సంస్థగా ఎదిగింది. టెలికాం నెట్‌వర్క్‌ల కోసం స్విచ్‌లు, రూటర్లు, ట్రాన్స్‌మిషన్‌ పరికరాలను తయారు చేస్తుంది. రిమోట్‌ నెట్‌వర్క్‌(Remote Network) నిర్వహణ కోసం సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా టెలికాం ఆపరేటర్లు, యుటిలిటీలు, రక్షణ మరియు ప్రభుత్వ క్లయింట్‌లకు నిర్వహించబడే సేవలను అందిస్తోంది.

    Tata Stock | నాలుగేళ్లలో లక్షను 45 లక్షలు చేసినా..

    తేజస్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ షేరు ధర 2020 ఏప్రిల్‌ 3వ తేదీన రూ. 31.65గా ఉంది. అక్కడి నుంచి ఈ స్టాక్‌ పుంజుకుంది. 2024 మార్చి తర్వాత రాకెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయి ఆ ఏడాది జూలై 5 నాటికి రూ. 1,439 వద్ద ఆల్‌టైం హై(All time high)కి చేరింది. అంటే 2020 ఏప్రిల్‌లో తేజస్‌ నెట్‌వర్క్స్‌లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌ చేసి ఉంటే.. ఆ స్టాక్స్‌ విలువ 2024 జూలై 5న రూ. 45.45 లక్షలు అయ్యిందన్న మాట.

    Tata Stock | ఏడాదిగా పతనం..

    గతేడాది నవంబర్‌ 6వ తేదీ నుంచి తేజస్‌ నెట్‌వర్క్స్‌ స్టాక్‌లో పతనం ప్రారంభమైంది. ఆ సమయంలో స్టాక్‌ ప్రైస్‌(Stock price) రూ. 1,410 ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, జియో పొలిటికల్‌ టెన్షన్స్‌తో అన్ని స్టాక్స్‌లాగే తేజస్‌ కూడా పతనమైంది. అయితే ఇతర స్టాక్స్‌ కోలుకున్నా ఇది మాత్రం కోలుకోలేకపోయింది. డిసెంబర్‌ మొదటివారం వరకు స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగిన స్టాక్‌.. ఆ తర్వాత ఒక్కసారిగా పతనమైంది. ఆగస్టులో 52 వారాల కనిష్ట(52 weeks low) ధర రూ. 542ను టచ్‌ చేసింది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుని గత ట్రేడింగ్‌ సెషన్‌లో రూ. 593 వద్ద స్థిరపడింది. కొంతకాలంగా మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా కంపెనీ ఆదాయం, లాభాలు(Profit) పెరగకపోగా తగ్గుతూ వస్తుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలహీనపడింది. దీంతో స్టాక్‌ బలహీనపడుతూ వస్తోంది.

    More like this

    Kamareddy SP | ఆటోల చోరీ కేసులో అంతర్​ జిల్లా దొంగల అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఆటోల చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్...

    Lingampet Mandal | ఫీడర్ ఛానల్​కు నీటి మళ్లింపు.. రైతుల పంటలు కాపాడేందుకు చర్యలు

    అక్షరటుడే, లింగంపేట: Lingampet Mandal | లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామ శివారులోని మల్లారం చెరువు కింద...

    Viral Video | ఇది ఐఫోన్ కాదు.. మేకప్ కిట్! .. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Viral Video | ప్రస్తుత టెక్నాలజీ యుగంలో విచిత్ర ఆవిష్కరణలకు కొదవే లేదు. సైకిల్‌ను...