అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TVK Chief Vijay | తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ (TVK Chief Vijay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను ఆయన ప్రజాస్వామ్య యుద్ధంగా అభివర్ణించారు.
టీవీకే పార్టీకి ఎన్నికల సంఘం (Election Commission) విజిల్ గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన పార్టీ సింబల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇప్పుడు జరగబోయేది కేవలం ఎన్నిక కాదని, ఇది ఒక ప్రజాస్వామ్య యుద్ధం అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న దుష్టశక్తిని. గతంలో పాలించిన అవినీతి శక్తి ఎదుర్కొనే ధైర్యం, పట్టుదల టీవీకేకి మాత్రమే ఉన్నాయన్నారు. ఆ రెండు పార్టీలు తమిళనాడును పాలించకూడదని డీఎంకే, అన్నా డీఎంకేను (DMK and AIADMK) ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
TVK Chief Vijay | ప్రజల మద్దతు ఉంది
టీవీకేకు అన్ని పార్టీలకతీతంగా మద్దతు ఉందని విజయ్ అన్నారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు తనను కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని చెప్పారు. తాము దేని కోసం తమ రాజకీయాలను రాజీ పడబోమని స్పష్టం చేశారు. గతంలో ఉన్నవారిలాగా తాను అవినీతికి పాల్పడను అన్నారు. వ్యవస్థాగత సంస్కరణలు రాత్రికి రాత్రే జరగవని విజయ్ అన్నారు. మార్పునకు సమయం, నిస్వార్థ నాయకత్వం అవసరమని తెలిపారు.