ePaper
More
    Homeజిల్లాలుకరీంనగర్Karimnagar BJP | బీజేపీలో ఏం జరుగుతోంది.. ఈటల నివాసానికి భారీగా కార్యకర్తలు

    Karimnagar BJP | బీజేపీలో ఏం జరుగుతోంది.. ఈటల నివాసానికి భారీగా కార్యకర్తలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karimnagar BJP | కరీంనగర్​ బీజేపీ(Karimnagar BJP)లో కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్​, హుజురాబాబ్​ మాజీ ఎమ్మెల్యే, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్​కు పొసగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో వర్గాలు ఉండొద్దని ఆయన అన్నారు. ఆ వర్గం.. ఈ వర్గం అని చెప్పుకునే వారికి టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీంతో ఈటల వర్గానికి చెందిన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

    ఈటల రాజేందర్ ​(Eatala Rajendhar) బీఆర్​ఎస్​ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయనతో పాటు అనుచరులు కూడా కాషాయ గూటికి చేరారు. ఈ క్రమంలో వారు ఈటల వర్గంగానే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్​ ఇటీవల కరీంనగర్​లో మాట్లాడుతూ.. పార్టీలో వర్గాలు ఉండొద్దన్నారు. బండి సంజయ్​ వర్గం కూడా ఉండొద్దని ఆయన చెప్పారు. అందరూ పార్టీ కోసమే పని చేయాలని, వ్యక్తి కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.

    Karimnagar BJP | మా పరిస్థితి ఏమిటీ

    బండి సంజయ్​ వ్యాఖ్యలతో ఈటల వర్గం నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా పార్టీలో కేడర్​ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్​లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అనంతరం మల్కాజ్​గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

    ఈ క్రమంలో ఆయన వర్గం వారికి స్థానికంగా పూర్తి సమయం అందుబాటులో ఉండడం లేదు. మరోవైపు త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలు, బండి సంజయ్ కామెంట్స్​తో హుజురాబాద్​లోని ఈటల రాజేందర్​ నివాసానికి భారీగా కార్యకర్తలు వెళ్లారు. పార్టీలో తమ పరిస్థితి ఏంటి అని వారు ఈటలను అడిగారు. స్థానిక ఎన్నికల్లో తమకు టికెట్లు కేటాయించాలని కోరారు. జిల్లాలో ఇతర నాయకుల ఆదిపత్యంతో తమకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల వర్గాన్ని పార్టీకి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    More like this

    Silver Price Today | బంగారం ధర ఆల్‌టైమ్ హై.. సిల్వర్​ పరిస్థితి ఏమిటంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Silver Price Today | దేశీయ మార్కెట్లో బంగారం ధరలు Gold Price రికార్డు...

    Gift nifty | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gift nifty | యూఎస్‌(US), యూరోప్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం ప్రధాన...

    September 8 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 8 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 8,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...