ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | ఆర్‌సీబీ‌ X కేకేఆర్ మ్యాచ్ రద్దు అయితే..?

    IPL 2025 | ఆర్‌సీబీ‌ X కేకేఆర్ మ్యాచ్ రద్దు అయితే..?

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్ (IPL 2025 season) పున: ప్రారంభానికి వరణుడు అడ్డంకిగా మారాడు. భారత్-పాకిస్థాన్ (india – pakistan) మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్‌ను బీసీసీఐ (BCCI) వారం రోజుల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ ప్రకటించిన రివైజ్డ్ షెడ్యూల్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) (Royal Challengers Bangalore), కోల్‌కతా నైట్‌రైడర్స్ (kolkata knight riders) మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (chinnaswamy Stadium) వేదికగా జరగాల్సిన మ్యాచ్‌‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. దాంతో ఇంకా టాస్ వేయలేదు. వర్షం కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పేసారు.

    చిన్నస్వామి స్టేడియంలో (chinnaswamy Stadium) అధునాతన డ్రైనేజీ వ్యవస్థ ఉండటం కలిసొచ్చే అంశం. వర్షం ఆగి మళ్లీ రాకుండా ఉంటే మ్యాచ్ సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వర్షం ఆగిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. అరేబియా సముద్రంలో (arabian sea) అల్పపీడనం కారణంగా గత నాలుగు రోజులుగా బెంగళూరులో వర్షాలు (rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళలో భారీ వర్షాలు పడుతున్నాయి. గత నాలుగు రోజులుగా వర్షం పడుతుండటంతో ఔట్ ఫీల్డ్ (out field) మొత్తం చిత్తడిగా మారింది. ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడితేనే మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉంది.

    ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు (KKR play off chances) దాదాపు సన్నగిల్లుతాయి. ప్రస్తుతం కేకేఆర్ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 11 పాయింట్స్‌తో పాయింట్స్‌ టేబులో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆర్‌సీబీతో (RCB) మ్యాచ్ రద్దయితే మరో పాయింట్ చేరుంతుంది. ఆఖరి మ్యాచ్ గెలిచినా 14 పాయింట్స్ ఖాతాలో ఉంటాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్‌పై ప్లే ఆఫ్స్ అవకాశాలు (play off chances) ఆధారపడి ఉంటాయి. కేకేఆర్ రన్‌రేట్ (KKR run rate) 0.193 కూడా గొప్పగా లేదు.

    మరోవైపు ఆర్‌సీబీ (RCB) 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు16 పాయింట్స్‌తో పాయింట్స్ టేబుల్‌లో (points table) రెండో స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్‌తో మ్యాచ్ రద్దయితే ఆర్‌సీబీ ఖాతాలో ఒక పాయింట్ చేరుతుంది. అప్పుడు 17 పాయింట్స్‌తో ప్లే ఆఫ్స్ బెర్త్ (play off birth) ఖాయం అవుతోంది. కాకపోతే ఆ జట్టు టాప్-2 ప్లేస్‌లో నిలవాలంటే చివరి రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం తెలంగాణ భవన్​లో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    More like this