అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పని ఖతమ అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు (Assembly Sessions) రావడం లేదు.
అప్పుడప్పుడు వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోతున్నారు. కానీ చర్చల్లో పాల్గొనలేదు. ఇటీవల సైతం మూడు నిమిషాలే సభలో ఉన్నారు. దీనిపై తాజాగా కవిత మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. అసెంబ్లీకి కేసీఆర్ (KCR) రాకపోతే బీఆర్ఎస్ పని ఖత అన్నారు. కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చడాన్ని ఆమె తప్పు పట్టారు. ఉద్యమ నాయకుడిపై మాట్లాడే ముందు రేవంత్ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హితవు పలికారు.
Kalvakuntla Kavitha | పిల్లకాకులకు బాధ్యతల ఏమిటి
కేసీఆర్ కృష్ణా జలాలపై అసెంబ్లీలో మాట్లాడి, కాంగ్రెస్ నోరు మూయించాలని కవిత అన్నారు. నదీ జలాల అంశాన్ని పిల్లకాకులకు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. కాగా కేటీఆర్, హరీశ్‌రావు (Harish Rao) నదీ జలాల విషయంలో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంది. దీంతో వారిని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆంధ్ర నాయకులు శాశ్వతంగా తెలంగాణ నీళ్లు ఎత్తుకెళ్లే యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్‌రావుపై మరోసారి ఆమె విమర్శలు చేశారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అని ఎద్దేవా చేశారు. పార్టీని మోసం చేసి అక్రమాలకు పాల్పడిన హరీష్ రావుకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారని పేర్కొన్నారు. పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్న వ్యక్తని ఆరోపించారు. భవిష్యత్‌లో జాగృతి ముందుకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి గడ్డు పరిస్థితులు తప్పవని కవిత అన్నారు.