ePaper
More
    Homeభక్తిJagannath Rath Yatra | జగన్నాథ రథ యాత్ర మధ్యలో వదిలేస్తే పాపం త‌గులుతుందా?

    Jagannath Rath Yatra | జగన్నాథ రథ యాత్ర మధ్యలో వదిలేస్తే పాపం త‌గులుతుందా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Jagannath Rath Yatra | హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటైన జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) ఈ ఏడాది జూన్ 27న ఘనంగా ప్రారంభమైంది. పూరి జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ వైభవమైన ఉత్సవం దేశ వ్యాప్తంగా మిలియన్ల భక్తులను ఆకర్షిస్తోంది. భగవాన్ జగన్నాథుడు, అన్న బలరాముడు(Balarama) (బలభద్ర), చెల్లెలు సుభద్రమ్మ(Subhadramma) దేవతలు ప్రత్యేకంగా అలంకరించబడిన మూడు రథాలపై గుండిచా దేవాలయం వరకు యాగ్ర‌గా వెళతారు. ఈ యాత్ర భక్తులకు ఆధ్యాత్మికంగా గొప్ప అనుభూతిని అందిస్తుంది.

    Jagannath Rath Yatra | మ‌ధ్య‌లో వ‌స్తే..

    జగన్నాథ రథయాత్ర పదిరోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు ఆలయం నుంచి గుండిచా ఆలయం(Gundicha Temple) వరకు దేవతలను తీసుకువెళతారు. అటుపై ఆ దేవాలయంలో తొమ్మిది రోజులు విశ్రాంతి తీసుకున్న అనంతరం, పదవ రోజు తిరిగి జగన్నాథ ఆలయానికి(Jagannath temple) వచ్చేస్తారు. ఈ యాత్రలో పాల్గొనడం వల్ల పాపాలు తొలగిపోతాయని, జీవితం మోక్ష మార్గంలోకి అడుగుపెడుతుందని నమ్మకం. రథాన్ని తాళ్లతో లాగడం స్వయంగా భగవంతుని సేవచేయడం లాంటిదే అనే విశ్వాసం ఉంది.

    ఈ పదిరోజుల యాత్రలో కొంతమంది భక్తులు(Devotees) పూర్తి యాత్రను చేయలేకపోతారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మధ్యలో వెనుదిరిగేవారూ ఉంటారు. అయితే, ఇది పాపం కాదు అని పండితులు స్పష్టంగా చెబుతున్నారు. భగవాన్ జగన్నాథుడు భక్తుల మనసు తెలుసుకుంటాడు. ఏ పూజ అయినా మనస్ఫూర్తిగా, భక్తిశ్రద్ధలతో చేయడమే ముఖ్యం. మీరు హాజరైన రోజుల్లో మీరు నిజంగా భక్తితో ఉండగలిగితే, అది మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఇక ఇంట్లో జగన్నాథుని విగ్రహం ఉంచవచ్చా? అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. జగన్నాథుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం సాధ్యమే, కానీ కొన్ని నియమాలు పాటించాలి. విగ్రహాన్ని సాధ్యమైనంత వరకూ పూజా గదిలో ఉంచాలి. ప్రతిరోజూ విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి, చందనం, పుష్పాలతో పూజ చేయాలి. విగ్రహాన్ని ఇంట్లో ఉంచిన తర్వాత త‌గు పూజాచర్యలు కొనసాగించాలి.

    పూరిలోనే కాదు, భారతదేశంలోని అనేక ప్రధాన నగరాల్లో కూడా జగన్నాథ రథయాత్రలు ఉత్సాహంగా నిర్వహించబడుతున్నాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు Bangalore వంటి నగరాల్లోని ఇస్కాన్‌ సంస్థలు, జగన్నాథ మందిరాలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాయి. వేలాది మంది భక్తులు వీటిలో పాల్గొంటూ హరినామ సంకీర్తనలతో మునిగిపోయారు.

    Latest articles

    Team india | శ్రేయాస్ అయ్య‌ర్‌కి నో ఛాన్స్.. ఆసియా క‌ప్‌లో ఆడే భార‌త జ‌ట్టు ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Team india | సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025...

    ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్​, సర్వేయర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాకు పనుల నిమిత్తం వచ్చే వారిని...

    Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. శ్రీవాణి దర్శన కోటా టికెట్ల పెంపు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. భక్తుల...

    Nizamsagar Project | ఆరేడు వరద గేట్ల ఎత్తివేత.. తిలకించేందుకు తరలివచ్చిన ప్రజలు

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ (Nizamsagar Project) పరిధిలోని ఆరేడు గ్రామ శివారులో...

    More like this