ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | చెత్తలో దొరికిన బంగారు గొలుసు.. మున్సిపల్​ సిబ్బంది ఏం చేశారంటే..

    Nizamabad City | చెత్తలో దొరికిన బంగారు గొలుసు.. మున్సిపల్​ సిబ్బంది ఏం చేశారంటే..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలో చెత్త సేకరణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్​ సిబ్బంది నిజాయితీ చాటారు. ఓ మహిళకు చెందిన బంగారు గొలుసును భద్రంగా ఆమె చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని జోన్​–2 పరిధిలోని 24వ డివిజన్​లో ఉదయం చెత్త సేకరణలో నిమగ్నమైన ట్రాక్టర్​ డ్రైవర్​ ఇమామ్​, జవాన్​ కుమార్​లకు రెండు తులాల బంగారు గొలుసు దొరికింది.

    అనంతరం కొద్దిసేపటికి గాయత్రినగర్​కు (Gayatri nagar) చెందిన పద్మాగౌడ్​ అనే మహిళ గొలుసు పోయిందని మున్సిపల్​ సిబ్బందిని సంప్రదించింది. దీంతో విచారణ అనంతరం ఆమెకు వారు బంగారు గొలుసును అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది ఇమామ్​, జవాన్​ కుమార్​ను కార్పొరేషన్​ కమిషనర్​ దిలీప్​కుమార్​ ఘనంగా సన్మానించారు. ప్రజలు చెత్తవేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. తమ సిబ్బంది నిజాయితీ నిబద్దతతో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.

    పోగొట్టుకున్న గొలుసును మహిళ పద్మాగౌడ్​కు అందజేస్తున్న మున్సిపల్​ సిబ్బంది

    More like this

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్​ ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్​డేట్​ వచ్చింది. బీసీ...

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...