Homeతాజావార్తలుViral Video | వేక‌ప్ బ్యాండ్.. కూతుళ్లు నిద్రలేవకపోవడంతో తల్లి చేసిన పనికి షాక్.. వీడియో...

Viral Video | వేక‌ప్ బ్యాండ్.. కూతుళ్లు నిద్రలేవకపోవడంతో తల్లి చేసిన పనికి షాక్.. వీడియో వైర‌ల్

తెల్ల‌గా తెల్లారింది, కూతుళ్లు ఇంకా మంచంలో చెద్దర్లు కప్పుకుని పడుకున్నారని తల్లి గమనించింది. అటువంటి సందర్భంలో ఆమెకు ఒక వినూత్న‌ ఆలోచన వచ్చింది. ఇద్దరు సంగీతకారులను పిలిచి, ఒకరు డోల్‌తో, మరొకరు ట్రంపెట్‌తో "శ్రీ రామ్ జాంకీ బైతే హై" అనే భక్తి గీతాన్ని వాయించమ‌ని చెప్పింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Viral Video | నేటి కాలంలో స్కూల్‌ School లేదా కాలేజీ పిల్లలను ఉదయం నిద్ర‌ లేపడం అంటే తల్లిదండ్రులకు నిజంగా ఓ సవాలే.

“లేవమ్మా.. పొద్దు పొడిచింది!” అన్న తల్లి మాటలకు పిల్లలు విసుక్కుంటూ, “ఇంకా ఐదు నిమిషాలు” అంటూ ముసుగులో దాక్కోవడం మనందరికీ తెలిసిన సీన్‌. కానీ, ఓ తల్లి మాత్రం తన కూతుళ్లు (Daughters) నిద్రలేవకపోవడంతో అద్భుతమైన ప్లాన్ వేసింది. ఆమె నేరుగా “సన్నాయి బృందాన్ని” పిలిపించి ఇంట్లోనే వాయించ‌మని చెప్పి వారిని నిద్రలేపింది.

Viral Video | ప్లాన్ అదిరింది..

సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూతుళ్లు ఇద్ద‌రు నిద్రలో ఉండగా, ఇద్దరు సంగీతకారులు ఇంట్లోకి వచ్చి ఒకరు డోలు, మరొకరు ట్రంపెట్‌తో “శ్రీ రామ్ జాంకీ బైతే హై” అనే భక్తి గీతాన్ని వాయించడం కనిపిస్తుంది. అలా ఒక్కసారిగా గది మొత్తం సన్నాయి శబ్ధాలతో మార్మోగిపోవడంతో కూతుళ్లు ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేస్తారు. ముఖాల్లో ఆశ్చర్యం, నవ్వు, చికాకుల మిశ్రమ భావాలు కనిపిస్తాయి. తల్లి నవ్వుతూ, “ఇలా అయినా లేస్తారా ఇప్పుడు?” అని అడగగా, కూతుళ్లు మొదట కోపంగా ఉన్నా చివరికి నవ్వుతూ తల్లిని కౌగిలించుకున్నారు. ఈ సీన్ చూసి నెటిజన్లు తెగ న‌వ్వేసుకుంటున్నారు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లలో మిలియన్ల వ్యూస్‌ సాధించింది. “మదర్ ఆఫ్ ది ఇయర్!”, “ఇది ప్యూర్ ఇండియన్ మామ్ ఎనర్జీ!”, “మా ఇంట్లో అయితే సన్నాయి కాదు.. డీజే పెట్టించాలి!” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తల్లి ప్రేమ, సరదా, సృజనాత్మకత కలిసిన ఈ వీడియో కేవలం నవ్వులు పంచడమే కాదు , మంచి సందేశం కూడా ఇస్తోంది. ప్రేమను కోపంతో కాకుండా హాస్యంతో వ్యక్తం చేయవచ్చని చూపిస్తూ, ఈ “వేకప్ బ్యాండ్” (Wakeup band) వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఈ ఫన్నీ సంఘటన అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.