అక్షరటుడే, వెబ్డెస్క్: Holidays | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. 2025లో 33 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్లో క్రిస్మస్ పండుగ సెలవులను (Christmas holidays) ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2026 సెలవుల జాబితా విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం (central government) 2026 సంవత్సరానికి వర్తించే సెలవుల జాబితాను ప్రకటించింది. జాతీయ సెలవు దినాలు, ముఖ్యమైన పండుగల వివరాలు వెల్లడించింది. ఏడాది మొత్తంలో 100 రోజులు సెలవులు ఉండనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (central government employees), పాఠశాలలకు జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 14 తప్పనిసరి సెలవులు, 12 ఆప్షనల్ హాలీడేస్ ఉన్నాయి. జనవరి 1 నూతన సంవత్సరం, 14న సంక్రాంతి, 23న వసంత పంచమి, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా హాలీడే ఉంటుంది.
Holidays | మార్చిలో భారీగా..
ఫిబ్రవరి-1న గురు రవిదాస్ జయంతి, 15న శివరాత్రి, 19న శివాజీ జయంతి సందర్భంగా సెలవు ఉంటుంది. మార్చి 4న హోలీ, 19న ఉగాది, 21న రంజాన్, 26న శ్రీరామ నవమి, 31న మహావీర్ జయంతి నేపథ్యంలో సెలవులు ప్రకటించారు. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే, 5న ఈస్టర్, 14న అంబేడ్కర్ జయంతి హాలీడేస్ ఉంటాయి. మే1న బుద్ద పౌర్ణమి, 9న రవీంద్రనాథ ఠాగూర్ జయంతి, 27న బక్రీద్, జూన్ 26న మొహర్రం, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, 26న మిలాద్ ఉన్ నబీ, 26న ఓణం, 28న రక్షాబంధన్ సందర్భంగా సెలవులు ఉంటాయని కేంద్రం తెలిపింది.
సెప్టెంబర్ 4న శ్రీకృష్ణాష్టమి, 14న గణేశ్ చతుర్థి, అక్టోబర్ 2న గాంధీ జయంతి, 18, 19, 20 తేదీల్లో విజయ దశమి సెలవులు ఉంటాయి. నవంబర్ 8న దీపావళి, 15న చఠ్ పూజ, 24న గురు నానక్ జయంతి, డిసెంబర్ 25న క్రిస్మస్ సెలవు ఉంటుంది. 52 ఆదివారాలు, 12 శనివారాలు రానున్నాయి. దీంతో వచ్చే ఏడాది టూర్లకు వెళ్లాలనుకునే ఉద్యోగులు సెలవుల ప్రకారం ప్లాన్ చేసుకుంటే బెటర్.