అక్షరటుడే, వెబ్​డెస్క్: INDvsENG Test | ఓవల్ వేదిక‌గా జరిగిన‌ ఇంగ్లండ్ – ఇండియా ఐదో టెస్ట్ (England-India fith test)  మ్యాచులో భార‌త్ థ్రిల్లింగ్​ విక్టరీ సాధించింది. ఆరు ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్​పై గెలుపొందింది. 374 పరుగుల భారీ లక్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్​ బిగ్ టార్గెట్‌ను చేజ్ చేస్తూ నాలుగో రోజు 339/6 ప‌రుగులు చేసింది. ఐదో రోజు భార‌త్ గెల‌వాలంటే నాలుగు వికెట్స్ తీయాలి. ఇంగ్లండ్ గెల‌వాలంటే 35 ప‌రుగులు చేయాలి. ఈ సంద‌ర్భంలో స్మిత్ క్రీజులో ఉన్నాడు. భార‌త్ గెలుపుపై చాలా మందికి హోప్స్ త‌క్కువ‌గానే ఉన్నాయి. అయితే సిరాజ్ (Mohammed Siraj) ఈ రోజు స్మిత్‌ని ఔట్ చేశాడు. దాంతో కొంత న‌మ్మ‌కం క‌లిగింది. ఆ త‌ర్వాత ఓవ‌ర్ట‌న్‌ను కూడా సిరాజ్ ఎల్బీగా ఔట్ చేశాడు.

INDvsENG Test | అద్భుత విజ‌యం..

అయితే అటిక్స‌న్‌(17) కాస్త ప్ర‌తిఘ‌ట‌న క‌న‌బ‌రిచాడు. టంగ్‌తో క‌లిసి ఇంగ్లండ్ జ‌ట్టును (England team) విజ‌యం వైపునకు తీసుకెళ్లేలా చేశాడు. కానీ ప్ర‌సిధ్​ కృష్ణ (Prasidh Krishna) అద్భుత‌మైన బాల్‌తో టంగ్‌ను ఔట్ చేశాడు. ఆ స‌మ‌యంలో గాయ‌ప‌డిన వోక్స్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. దాంతో మ్యాచ్ మ‌రింత థ్రిల్లింగ్‌గా మారింది. అటిక్స‌న్.. సిరాజ్ బౌలింగ్‌లో భారీ సిక్స‌ర్ బాదడంతో అంద‌రిలో టెన్ష‌న్ మొద‌లైంది. కానీ సిరాజ్ త‌ర్వాతి ఓవ‌ర్‌లో అద్భుత‌మైన బంతితో బౌల్డ్ చేశాడు. దీంతో ఆరు పరుగుల తేడాతో భార‌త్ గెలిచింది. దీంతో సిరీస్ స‌మం అయింది. సిరాజ్ ఐదు వికెట్ల‌తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ప్ర‌సిద్ కృష్ణ నాలుగు వికెట్లు తీశాడు. అర్ష్ దీప్ ఒక వికెట్ తీశాడు.

వాస్తవానికి ఈ మ్యాచ్‌లో టీమిండియా (Team India) ఇంత పోటీ ఇచ్చిందంటే దానికి కారణం సిరాజ్ అని చెప్పాలి. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులకే ఆలౌటై వెనక‌బడినప్పుడు సిరాజ్ జట్టును నిలబెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో బజ్‌బాల్ గేమ్‌తో తొలి వికెట్‌కు 92 పరుగులు చేసిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 247 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జాకోబ్ బెతెల్‌ను ఆలౌట్ చేసిన సిరాజ్.. ఇంగ్లండ్ కోలుకోకుండా చేశాడు. ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ అద్భుత‌మైన బౌలింగ్ చేశాడు. గిల్ కెప్టెన్సీలో భార‌త్ .. ఇంగ్లండ్ గడ్డ‌పై అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది అని చెప్పాలి.