అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) ఆదేశించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని (Yellareddy constituency) రైతులు వరి కొనుగోలు కేంద్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కోఆపరేటివ్ అధికారితో (DCO) శనివారం మాట్లాడారు.
వరి తూకం వేసే సమయంలో రెండు కిలోల తరుగును అదనంగా తీస్తున్నారని నా దృష్టికి వచ్చిందన్నారు. తక్కువ తరుగు తీసేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇటీవల వరదల కారణంగా ధాన్యం రంగు మారిందని.. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అలాగే రైతులు ఇబ్బందులు పడకుండా లారీలు, వాహనాలు తగినన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యాన్ని మిల్లులకు వెనువెంటనే తరలించాలన్నారు.
