Homeజిల్లాలునిజామాబాద్​Indalwai | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

Indalwai | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ నాయకుడు సాయాగౌడ్‌ డిమాండ్‌ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

- Advertisement -

అక్షర టుడే, ఇందల్వాయి: Indalwai | భారీ వర్షాలకు (Heavy Rains) తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా నాయకుడు సాయాగౌడ్‌ డిమాండ్‌ చేశారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

కలెక్టర్, రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతి రెడ్డి (Rural MLA Dr. Bhupathi Reddy) ఆదేశాలను పక్కనపెట్టి.. కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. నీట మునిగి నష్టపోయిన వరి పొలాలకు ఎకరానికి రూ.50 వేల చొప్పున, ఇతర పంటలకు రూ.30వేల చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాంబాబు, సాయిలు, మీనా, పుష్ప, నర్సయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.