ePaper
More
    Homeక్రీడలుWest Indies VS Pakistan | పాకిస్తాన్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించిన వెస్టిండీస్.. 34...

    West Indies VS Pakistan | పాకిస్తాన్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించిన వెస్టిండీస్.. 34 ఏళ్ల రికార్డ్‌కు బ్రేక్ ప‌డిందిగా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: West Indies VS Pakistan | వెస్టిండీస్ క్రికెట్ జట్టు (West Indies Cricket Team) అరుదైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 34 సంవత్సరాల తర్వాత, ఎట్టకేలకు పాకిస్తాన్‌పై వన్డే సిరీస్ గెలిచింది. మూడో వన్డేలో అత్యద్భుత ప్రదర్శనతో పాక్‌ను చిత్తుగా ఓడించి, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

    ఈ గెలుపుతో వెస్టిండీస్, 1991 తరువాత మొదటిసారి పాక్‌పై వన్డే సిరీస్ (ODI Series) విజయం సాధించింది. ఈ విజయం ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో (Brain Lara Stadium) జరిగిన మూడో వన్డేలో నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. కెప్టెన్ షై హోప్ (Captain Shai Hope) అద్భుత సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. ఆయన 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 120 నాటౌట్‌గా నిలిచాడు.

    West Indies VS Pakistan | భారీ విజ‌యం..

    జస్టిన్ గ్రీవ్స్ కూడా 24 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి విండీస్ స్కోరును ప‌రుగులు పెట్టించాడు. అయితే ల‌క్ష్య చేధన‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్, కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయ్యింది. విండీస్ బౌలింగ్ (West Indies Bowling) ఎదుర్కోలేక పూర్తిగా కుప్పకూలింది. ఓపెనర్లిద్దరూ డకౌట్ అయ్యారు. బాబర్ ఆజమ్ (Babar Azam)(9), కెప్టెన్ రిజ్వాన్ (0) పరుగులకే వెనుదిరిగారు. ఒక దశలో పాకిస్తాన్ (Pakistan) 8 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి, మ్యాచ్ నుంచి పూర్తిగా వెనకపడిపోయింది. మొత్తం ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అవడం పాక్ జ‌ట్టును కోలుకోనివ్వ‌కుండా చేసింది.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సల్మాన్ ఆఘా (30) మాత్రమే కొంత పోరాడినట్టు కనిపించాడు.

    విండీస్ బౌలింగ్‌లో జేడెన్ సీల్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. 7.2 ఓవర్లలో 34 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం ద్వారా పాక్ కోలుకోనివ్వ‌కుండా చేశాడు. గుడకేష్ మోతీ రెండు వికెట్లు, రోస్టన్ చేజ్ ఒక వికెట్ తీశారు. ఈ సిరీస్ విజయంతో వెస్టిండీస్ జట్టు ప్ర‌తీకారం తీర్చుకున్నట్టు ఫ్యాన్స్ (Cricket Fans) భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో, పాకిస్తాన్‌పై ఈ ఘనవిజయంతో మళ్లీ జ‌ట్టులో ఉత్సాహం వ‌చ్చింది. ఇలాంటి విజయం వెస్టిండీస్ క్రికెట్‌కు కొత్త జోష్ నింపిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. విండీస్ ఈ గెలుపుతో, పాక్‌తో 34 ఏళ్ల పాత పగను తీర్చుకున్నట్టయింది.

    Latest articles

    Coolie Movie | కూలీ సినిమా చూసేందుకు పిల్ల‌ల‌కి అనుమ‌తి లేదు..గుర్తింపు కార్డ్ త‌ప్ప‌నిస‌రి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్...

    Nizamsagar | ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా..

    అక్షరటుడే నిజాంసాగర్: Nizamsagar | ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma Housing scheme) ఇసుకను సరఫరా పేరుతో పలువురు అక్రమార్కులు...

    Mp Arvind | ఆర్వోబీల నిర్మాణంలో జాప్యంపై రాష్ట్ర ఆర్థికమంత్రిని కలుస్తా..: ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే ఇందూరు: Mp Arvind | రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం చేయడంతోనే ఆర్వోబీల (ROB)...

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలర్ట్​.. పది రైళ్లు రద్దు.. ఎందుకంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Railway Passengers | దేశవ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడంతో...

    More like this

    Coolie Movie | కూలీ సినిమా చూసేందుకు పిల్ల‌ల‌కి అనుమ‌తి లేదు..గుర్తింపు కార్డ్ త‌ప్ప‌నిస‌రి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్...

    Nizamsagar | ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా..

    అక్షరటుడే నిజాంసాగర్: Nizamsagar | ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma Housing scheme) ఇసుకను సరఫరా పేరుతో పలువురు అక్రమార్కులు...

    Mp Arvind | ఆర్వోబీల నిర్మాణంలో జాప్యంపై రాష్ట్ర ఆర్థికమంత్రిని కలుస్తా..: ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే ఇందూరు: Mp Arvind | రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం చేయడంతోనే ఆర్వోబీల (ROB)...