Homeజిల్లాలుకామారెడ్డిMla Pocharam | మత్స్యకారుల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు: ఎమ్మెల్యే పోచారం

Mla Pocharam | మత్స్యకారుల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు: ఎమ్మెల్యే పోచారం

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని చెరువులో ఉచిత చేపపిల్లలను వదిలారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | మత్స్యకారుల అభివృద్ధి (Fishermens) కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు. ఉచిత చేప విత్తనాల పంపిణీ ద్వారా మత్స్యకారుల ఆదాయం పెరగడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.

Mla Pocharam | చేపపిల్లల విడుదల

బాన్సువాడ (Banswada) పట్టణంలోని కల్కి చెరువులో బుధవారం వంద శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఉచిత చేప విత్తనాలను విడుదల చేశారు. వాటిని స్థానిక చెరువులో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేపలను దళారులకు విక్రయించకుండా మత్స్యకారులు అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ (Additional Collector Victor), జిల్లా మత్స్యశాఖ (Fisheries Department) అధికారి శ్రీపతి, పసుపుల సాయిలు, నాయకులు నారా సురేష్, ఎర్వల కృష్ణారెడ్డి, ఎజాజ్, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.