అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Youth Congress | సంక్షేమ పథకాలను (welfare schemes) ప్రజల్లోకి తీసుకెళ్లాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ పేర్కొన్నారు. నగరంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు.
ఇటీవల సర్పంచ్‌లుగా గెలిచిన యూత్ కాంగ్రెస్ నాయకులను (Youth Congress leaders) ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
Youth Congress | క్రమశిక్షణతో పనిచేయాలి
యూత్ కాంగ్రెస్ శ్రేణులు క్రమశిక్షణతో పని చేయాలని, అదే వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని విపుల్‌గౌడ్ (Vipul Goud) పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల అనుగుణంగా పనిచేసి రాబోయే పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్దేశించిన అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నరేందర్ గౌడ్, రాజు గౌడ్, ఆదిత్య, జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్బోల్ల శ్రీకాంత్ అసెంబ్లీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.