అక్షరటుడే, ఎల్లారెడ్డి: Youth Congress | సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, జోనల్ ఇన్ఛార్జి థామస్ సూచించారు. ఎల్లారెడ్డి క్యాంప్ ఆఫీస్లో (Yellareddy camp office) కామారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
Youth Congress | పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారికి సన్మానం..
ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) యూత్ కాంగ్రెస్ నుంచి గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం మధుసూదన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జీ వినూత్న రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ, ఈసీ కలిసి ఓట్ చోరీలో పాలు పంచుకుంటున్నాయన్నారు. విత్ ఐవైసీ యాప్, స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత పాత్రపై వారు నాయకులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సర్దార్ నాయక్, శ్రీనివాస్, సయ్యద్ మన్సూర్, ఇమ్రోజ్, అన్ని మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.