అక్షరటుడే, ఇందూరు: Weightlifting Association | జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఎన్నికలు (District Weightlifting Association elections) ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య తెలిపారు. రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మార్గదర్శకాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Weightlifting Association | ఒలింపిక్ అసోసియేషన్ నుంచి పరిశీలకుడు..
ఇప్పటికే ఎన్నికల నిమిత్తం ఒలింపిక్ అసోసియేషన్ (Olympic Association) తరపున పరిశీలకుడిని నియమించినట్లు తెలిపారు. అలాగే జిల్లా యువజన క్రీడల శాఖ అధికారికి లేఖను అందజేశామన్నారు. ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా సీనియర్ న్యాయవాది బొబ్బిలి చిన్నారెడ్డి వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో ఉదయం 11 గంటలకు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.