Homeజిల్లాలుహైదరాబాద్Cyberabad Police | తగ్గేదే లే అంటున్న మందుబాబులు.. ఎంత మంది చిక్కారంటే..

Cyberabad Police | తగ్గేదే లే అంటున్న మందుబాబులు.. ఎంత మంది చిక్కారంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyberabad Police | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఏ మాత్రం ఏమారపాటుగా ఉన్న ప్రమాదాలు జరుగుతాయి. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు. చాలా ప్రమాదాలకు డ్రంకన్​ డ్రైవ్ (Drunk and Drive)​ కారణమని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నగరంలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. పగటి పూట కూడా డ్రంకన్​ డ్రైవ్​ టెస్ట్​లు చేస్తూ మందుబాబుల ఆట కట్టిస్తున్నారు. శని, ఆదివారాల్లో వీకెండ్​ స్పెషల్​ డ్రైవ్​లు చేపడుతున్నారు. అయినా మందుబాబులు మాత్రం తగ్గడం లేదు.

సైబరాబాద్​ పోలీసులు శనివారం డ్రంకన్​ డ్రైవ్​ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వీకెండ్​ కావడంతో మద్యం ప్రియులు పూటుగా తాగి ఇళ్లకు వెళ్తుంటారు. ఇలాంటి వారితో ప్రమాదాలు జరుగుతుండటంతో ట్రాఫిక్​ పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 272 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో ద్విచక్రవాహనదారులు 227 మంది ఉన్నారు. త్రిచక్ర వాహనాలు నడిపేవారు 15, కారు డ్రైవర్లు 29 మంది. హెవీ వెహికల్​ నడిపేవారు ఒకరు ఉన్నారు. వీరికి కౌన్సెలింగ్​ ఇచ్చి కోర్టులో హాజరు పర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.

Cyberabad Police | యువకులే అధికం

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో యువకులే (Youth) అధికంగా ఉన్నారు. 18–20 ఏళ్లలోపు వారు 8 మంది డ్రంకన్​ డ్రైవ్​లో దొరికారు. 20–30 ఏళ్లలోపు వారు 118 మంది చిక్కారు. 60 ఏళ్లపై ఉన్నవారు నలుగురు డ్రంకన్​ డ్రైవ్​లో దొరకడం గమనార్హం. కాగా గతవారం నిర్వహించిన తనిఖీల్లో 299 దొరికారు. వీరిలో 277 మందికి కోర్టు (Court) జరిమానా వేసింది. 22 మందికి జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష వేస్తున్న మద్యం తాగి వాహనాలు నడిపే వారుమాత్రం మారడం లేదు.

Must Read
Related News