అక్షర టుడే, డిచ్పల్లి: Dichpally | మండలంలోని మిట్టపల్లి శివారులో డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ఎస్సై షరీఫ్ (SI Sharif) తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలంలోని (Indalvai mandal) మల్లాపూర్‌లో గురువారం పెళ్లికి వెళ్లిన వ్యక్తులు నగరంలోని అర్సపల్లికి తిరుగు ప్రయాణంలో భాగంగా డీసీఎం ఎక్కారు. డీసీఎం మిట్టపల్లి గ్రామ శివారులో (Mittapalli village) మూలమలుపు వద్ద డీసీఎం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో డీసీఎంను బయటకు తీయించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు.
