అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kakinada | ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా లో పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న వారి మీదకు కారు దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం (Kirlampudi Mandal) సోమవరం దగ్గర హైవేపై శనివారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. పెళ్లి వేడుక ముగించుకొని అన్నవరం నుంచి జగ్గంపేట (Jaggampet)కు వెళ్తుండగా.. కారు ముందు టైరు పేలింది. దీంతో సోమవరం దగ్గర హైవేపై ఉన్న బస్సు షెల్టర్‌లోని ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. అనంతరం బైక్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.
Kakinada | తీవ్ర విషాదం
బస్సు కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, ప్రయాణికులపై కారు దూసుకెళ్లడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముందు టైర్ పేలడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు. కాగా గాయపడిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ (MLA Jyotula Nehru) బాధితులను పరామర్శించారు.
Kakinada | విజయవాడ హైవేపై కారు దగ్ధం
విజయవాడ – హైదరాబాద్ వైవేపై శనివారం తెల్లవారుజామున ఇన్నోవా (Innova) కారు బోల్తా పడింది. అంతనం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో కారు దగ్ధమైంది. ఈ ఘటనలో కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల చెవేళ్ల, కర్నూల్ బస్సు ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే.
