Weather Updates

Weather alert | వెద‌ర్ అల‌ర్ట్.. ఆగ‌స్టు 12 వ‌ర‌కు ఈ ప్రాంతాల‌లో వ‌ర్షాలే వ‌ర్షాలు..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Weather alert : గ‌త వారం రోజులుగా ఉక్క‌పోత‌తో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కి ఇప్పుడు చ‌ల్ల‌ని క‌బురు అందింది. పలు ప్రాంతాల్లో ఆగస్టు 12 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD Alert) తెలిపింది.

ఈ క్రమంలో ఢిల్లీ Delhi, పంజాబ్ Punjab, హిమాచల్ ప్రదేశ్ Himachal Pradesh, జమ్మూ కశ్మీర్ Jammu and Kashmir, హరియాణా Haryana, ఉత్తరాఖండ్ Uttarakhand, పశ్చిమ ఉత్తరప్రదేశ్‎లలో ఆగస్ట్ 8 నుంచి 12 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ Meteorological Department తెలియ‌జేసింది. దీంతోపాటు ఆగస్టు 8 నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather alert : వారికి హెచ్చ‌రికలు..

బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఆగస్టు 8 నుంచి 10 వరకు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే అక్కడి చాలా నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) పడొచ్చని వెల్లడించింది.

వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

కర్ణాటకలో బెంగళూరు రూరల్, తుమకూరు, చిత్రదుర్గ, దవనగెరె, కోప్పల్, బాగలకోట్, బెల్గాం వంటి జిల్లాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, అక్కడ వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయింది. దీంతో రానున్న రెండు వారాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.

బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని, అందుకే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వెదర్ రిపోర్ట్ Weather Report తెలిపింది. సెప్టెంబర్ కల్లా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

భారీ వర్షాలు, వరదల వల్ల ప్రత్యేకంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశి జిల్లాలో వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాలలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ వర్షాలతో కొండలపై నుంచి కొట్టుకువచ్చిన నీరు, మట్టితో అనేక గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.