ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Turmeric Research Center | పసుపు పరిశోధన కేంద్రం కోసం ఎంతో కష్టపడ్డాం..: కోటపాటి

    Turmeric Research Center | పసుపు పరిశోధన కేంద్రం కోసం ఎంతో కష్టపడ్డాం..: కోటపాటి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: Turmeric Research Center | కమ్మర్​పల్లిలో (Kamamrpally) పసుపు పరిశోధన కేంద్రం (Turmeric Research Center) కోసం ఎన్నో పోరాటాలు చేశామని రైతు నాయకుడు కోటపాటి నరసింహానాయుడు పేర్కొన్నారు. కమ్మర్​పల్లి మండల కేంద్రంలోని పరిశోధన కేంద్రాన్ని శనివారం సందర్శించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని 2007లో ఢిల్లీలోని జంతర్ మంతర్​లో నిజామాబాద్, కరీంనగర్ రైతులతో ధర్నా నిర్వహించి అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరత్ పవర్​ను కలిసి విన్నవించామన్నారు.

    దీంతో శరత్​పవార్​ వెంటనే స్పందించి అప్పటి హైదరాబాద్​లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (NG Ranga Agricultural University) వైస్ ఛాన్స్​లర్​తో మాట్లాడి పసుపు పరిశోధన కేంద్రం మంజూరు చేయాల్సిందిగా ఆదేశించారని వివరించారు. అనంతరం కమ్మర్​పల్లిలో 36 ఎకరాల్లో ఏర్పాటు చేయబడిందని, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం (Konda Laxman Bapuji Horticulture University) ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తోందన్నారు.

    Turmeric Research Center | 350 ఎకరాల్లో..

    దాదాపు 350 ఎకరాల్లో పసుపు రకాలను పండిస్తూ రైతులకు ప్రయోజన కరమైన రీతిలో అధిక కర్కుమిన్ రకాలను సాగు చేస్తున్నారని కోటపాటి వివరించారు. పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బోర్లకుంట మహేందర్, టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్​లు కోటపాటికి సాగు పద్ధతులు, పరిశోధన ఫలితాలను వివరించారు. ఈ ఏడాది వందలాది మంది రైతులకు అధిక కర్కుమిన్, అధిక దిగుబడి ఇచ్చి వంగడాలను పంపిణీ చేసినట్లుగా వివరించారు.

    తాము పోరాడి సాధించుకున్న పరిశోధనా కేంద్రం సమర్థవంతంగా పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడి శాస్త్రవేత్తలు, సిబ్బందిని అభినందించారు. పరిశోధన కేంద్రాన్ని పసుపు రైతులు తరచుగా సంప్రదించి పరిశోధనా ఫలితాలను అంది పుచ్చుకోవాలని సూచించారు. ఆయన వెంట కొక్కుల విద్యాసాగర్, రుక్మాజీ లున్నారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this