ePaper
More
    HomeతెలంగాణJagadish Reddy | ఆ మీడియా హౌస్​ల పనిపడతాం.. మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Jagadish Reddy | ఆ మీడియా హౌస్​ల పనిపడతాం.. మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagadish Reddy | కేసీఆర్​ క్షమించినా.. తాము మాత్రం ఎల్లో మీడియాను వదిలిపెట్టమని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి (Jagadish Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్​లోని మహా న్యూస్ (Maha News)​ ఆఫీస్​పై కొందరు బీఆర్​ఎస్ (BRS)​ కార్యకర్తలు శనివారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిపై జగదీశ్​రెడ్డి స్పందించారు. మహాన్యూస్​పై దాడి జరగ్గానే.. చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గం, తెలంగాణలో ఆయన శిష్యులు హడావుడి చేస్తున్నారన్నారు.

    Jagadish Reddy | కార్యకర్తలు ఊరుకోరు

    తెలంగాణ కొందరు మీడియా హౌస్​ల పేరిట స్లాటర్​ హౌస్​లు నడుపుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (KCR)​, కేటీఆర్ (KTR)​ వ్యక్తిత్వాన్ని చంపేలా వార్తలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్​, కేటీఆర్​పై దాడి చేస్తే కార్యకర్తలు చూస్తు ఊరుకోరని ఆయన హెచ్చరించారు. మహాన్యూస్​పై జరిగింది దాడి కాదని.. అది నిరసన మాత్రమే అని ఆయన​ అన్నారు. తాము దాడులు చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు.

    Jagadish Reddy | వెతికి పట్టుకొని పని చేస్తాం

    మీడియా ముసుగులో తప్పుడు వార్తలు ప్రచురించే వారిని వదిలి పెట్టమని ఆయన హెచ్చరించారు. బిన్​ లాడెన్​ను వెతికినట్లు వెతికి పట్టుకొని వారి పని చేస్తామన్నారు. అలాంటి వారిని ఎవరికి కాపాడలేరని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా న్యూస్​ కాకుండా ఇంకో రెండు, మూడు ఉన్నాయని, వాటి పని కూడా చేస్తామన్నారు.

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...