అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Kesha Mahesh | తనను గెలిపిస్తే 42వ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి (Congress candidate) కేశ మహేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం కంఠేశ్వర్‌లో ప్రచారం నిర్వహించారు.
Kesha Mahesh | కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున..
అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) సహకారంతో 42వ వార్డు అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తానని కేశ మహేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. ఓట్లను అభ్యర్థించారు. అభివృద్ధి చేసే పార్టీకే పట్టం కట్టాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలో ఉన్నందున డివిజన్‌లోనూ అధికార పార్టీ అభ్యర్థి ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలకు వివరించారు.
Kesha Mahesh | అనేక పథకాలు అమలులో..
రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో అనేక సంక్షేమ పథకాలు (Welfare Schemes) అమలులో ఉన్నాయని కేశ మహేష్ అన్నారు. తనను గెలిపిస్తే విరివిగా నిధులు తీసుకొచ్చి డివిజన్‌ను అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలు సైతం తమ వెంట ఉండే అభ్యర్థినే గెలిపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.