అక్షరటుడే, ఇందూరు : Ippakayala Sumitra Kishore | తనను గెలిపిస్తే 24వ డివిజన్ వాసులకు అండగా నిలిచి, డివిజన్ను అభివృద్ధి చేస్తానని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని (BJP Corporator Candidate) ఇప్పకాయల సుమిత్రా కిషోర్ హామీ ఇచ్చారు. డివిజన్ పరిధిలోని ఆయా కాలనీల్లో బుధవారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Ippakayala Sumitra Kishore | గతంలోనూ ప్రజల మధ్యే ఉన్నాం..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలోనూ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేశామని తెలిపారు. పలు కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ, పారిశుధ్యం వంటి సమస్యలను పరిష్కరించామని వివరించారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind), అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana Gupta) సహకారంతో డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తామని ఆమె పేర్కొన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం (BJP Government) అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని సుమిత్రా కిషోర్ వివరించారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు శాశ్వత గృహాలు, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం అందుతోందని చెప్పారు. అలాగే స్వచ్ఛ భారత్ అభియాన్ (Swachh Bharat Abhiyan) ద్వారా పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మహిళల సాధికారత కోసం ముద్ర యోజన ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు, వృద్ధులకు పెన్షన్ పథకాలు, రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతోందని వివరించారు.
Ippakayala Sumitra Kishore | డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
డివిజన్లో తనకు మంచి స్పందన లభిస్తోందని, ప్రజలు బీజేపీ పాలనపై విశ్వాసంతో ఉన్నారని సుమిత్రా కిషోర్ తెలిపారు. డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రజల ఆశీర్వాదంతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 24వ డివిజన్ను అభివృద్ధిలో ముందంజలో నిలిపేలా శాయాశక్తులా కృషి చేస్తానని ఆమె అన్నారు. ఆమె వెంట పలువురు కార్యకర్తలు ఉన్నారు.