అక్షరటుడే, ఇందూరు: Vana Mahotsavam | నిజామాబాద్ జిల్లాను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ (Shabbir Ali) తెలిపారు. వనమహోత్సవంలో భాగంగా సోమవారం నగరంలోని మారుతి నగర్లో (maruthi nagar) అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు. కుల మతాలకతీతంగా అన్ని వర్గాల వారు బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Vana Mahotsavam | ఈ ఏడాది టార్గెట్ 51 లక్షలు..
జిల్లాలో ఈ ఏడాది 51లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని విధించుకున్నామని షబ్బీర్అలీ పేర్కొన్నారు. లక్ష్యసాధనకు సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఉచితంగా మొక్కలు అందిస్తోందని, నగరవాసులు తమ ఇంటి వద్ద నాటాలని కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ (State Urdu Academy), రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ (State Cooperative Union) ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా (NUDA) ఛైర్మన్ కేశ వేణు, ఇన్ఛార్జి డీఎఫ్వో నిఖిత, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.