అక్షరటుడే, గాంధారి : Gandhari Mandal | గాంధారిని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ రేణుక సంజీవ్ (Sarpanch Renuka Sanjeev) పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామంలో సోమవారం సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రేణుక సంజీవ్ మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి సర్పంచ్‌గా గెలిపించినందుకు ప్రజలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Gandhari Mandal | ఎన్నో అడ్డంకులు వచ్చినా..
ఎన్నో అడ్డంకులు వచ్చిన.. ప్రజలను ఎన్నో రకాలుగా మభ్యపెట్టినప్పటికీ వారు నిజాయితీగా తనవైపు నిలబడ్డారని ఆమె పేర్కొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. జిల్లాలోనే గాంధారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. తహశీల్దార్ రేణుక జవాన్, ఎంపీడీవో రాజేశ్వర్ (MPDO Rajeshwar) సమక్షంలో సర్పంచ్, ఉపసర్పంచ్ భాస్కర్ గౌడ్, 13 వార్డుల మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.