అక్షరటుడే, ఇందూరు : Dinesh Kulachari | మాజీమంత్రి డి.శ్రీనివాస్ (DS Srinivas) ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. డీఎస్ జయంతి (DS Jayanti) సందర్భంగా నగరంలోని బైపాస్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దినేష్ కులాచారి (Dinesh Kulachari) మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి డీఎస్ ఎంతో కృషి చేశారన్నారు. పేదల కోసం నిరంతరం పాటుపడేవాడని, ఎందరికో రాజకీయ భిక్ష పెట్టిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. దేశ రాజకీయాల్లో జిల్లా పేరును నిలబెట్టాడని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఆదర్శంగా నిలిచారన్నారు. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తూ కాంగ్రెస్ను (Congress) అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు.
అప్పట్లో రాష్ట్రపతి ప్రధాని కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి అని తెలిపారు. డీఎస్ అభిమానులుగా తాము ఎప్పటికీ గుర్తు చేసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, మాజీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.