అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Constable Pramod | రౌడీ షీటర్ రియాజ్ చేతిలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందడం చాలా బాధాకరమని.. ఆయన కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Bomma Mahesh kumar) అన్నారు. ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్‌తో (MLC Shabbir Ali) కలిసి గురువారం పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ (CCS Constable Pramod) ప్రాణాలు కోల్పోవడం తమను కలిచివేసిందన్నారు. అతని ముగ్గురు కుమారులను ప్రభుత్వ పరంగా చదివిస్తామని హామీ ఇచ్చారు.
Constable Pramod | సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం తరపున రూ.కోటి సాయం, ఇంటిస్థలం కేటాయించామన్నారు. అనంతరం షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో యువ కానిస్టేబుల్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రియాజ్‌ను పట్టుకున్న ఆసిఫ్‌ను పరామర్శిస్తామన్నారు. ప్రమోద్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ తదితరులున్నారు.
