అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: DGP Shivdhar Reddy | రౌడీ షీటర్ రియాజ్ (rowdy sheeter Riyaz) దాడిలో మరణించిన ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) తెలిపారు. ప్రమోద్ కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
కానిస్టేబుల్ ప్రమోద్ (constable Pramod) కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అలాగే ప్రమోద్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 300 గజాల ఇంటి స్థలం అందజేస్తున్నామని వివరించారు. కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండేవాడన్నారు. అందరితో కలిసి మెలిసి ఉండేవాడని వివరించారు. అయితే కేసు విచారణలో ఉండగా ఇతర విషయాలు మాట్లాడడం లేదని చెప్పారు.
DGP Shivdhar Reddy | ఆసిఫ్ కుటుంబానికి రూ. 50వేలు
నేరస్తుడు రియాజ్ను పట్టుకోవడంలో సహకరించిన ఆసిష్కు రూ. 50 వేల రివార్డు అందజేస్తున్నామని డీజీపీ తెలిపారు. ఆసిఫ్ ప్రాణాలకు తెగించి రియాజ్ ను పట్టుకున్నాడని వివరించారు. ఆసిఫ్ సహకారంతోనే కేసును ఛేదించగలిగామని పేర్కొన్నారు. బాధితుడు ఆఫీస్కు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని చెప్పారు. సమావేశంలో ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ (Additional DG Vijay Kumar), డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పాల్గొన్నారు.