Homeజిల్లాలునిజామాబాద్​Banswada | క్రీడాకారులకు అండగా ఉంటాం : కాసుల బాలరాజ్​

Banswada | క్రీడాకారులకు అండగా ఉంటాం : కాసుల బాలరాజ్​

బాన్సువాడలో ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్​ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలిచిన జట్లకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్​ ఛైర్మన్​ కాసుల బాలరాజు బహుమతులు అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ : Banswada | రాష్ట్రస్థాయి క్రీడల నిర్వహణకు బాన్సువాడ పట్టణం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్​ ఛైర్మన్​ కాసుల బాలరాజు (Kasula Balaraju) అన్నారు.

పట్టణంలో ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు (Volleyball Competitions) జరిగాయి. సోమవారం రాత్రి విజేతలకు బహుమతులు అందించారు. బహుమతుల ప్రదానోత్సవానికి కాసుల బాలరాజ్​ హాజరై మాట్లాడారు. క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే పొచారం శ్రీనివాస్ రెడ్డితో (MLA Pocharam Srinivas Reddy) పాటు తాను కూడా క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. అవసరం వస్తే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను కూడా బాన్సువాడలో నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మినీ స్టేడియంలో అవసరమైన వసతుల అభివృద్ధి అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సహకారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Banswada | మెరిసిన బాన్సువాడ జట్లు

ఫైనల్ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాల్లో బాన్సువాడ జట్లు అద్భుత విజయాలు సాధించాయి. పురుషుల విభాగంలో బాన్సువాడ, తాడ్వాయి మధ్య ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్​లో బాన్సువాడ విజయం సాధించింది. మహిళల విభాగంలో బాన్సువాడ (Banswada), మగ్గిడి జట్లు తలపడ్డాయి. ఈ పోటీలో కూడా బాన్సువాడ జట్టు విజయం సాధించింది. విజేతలకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి ఫోన్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ ఛైర్మన్ ఎరువాల కృష్ణారెడ్డి, నార్ల సురేష్, ఎజాజ్, నార్ల రవీందర్, ఖాలిద్, గౌస్ పాషా, బాబా, వాహబ్, హకీం, కిరణ్, వెంకటేశం, పీడీ సురేందర్, వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు మల్లేశ్ గౌడ్, రవీందర్ రెడ్డి, కామారెడ్డి డీవైఎస్​వో రంగా గౌడ్, నిజామాబాద్ డీవైఎస్​వో నవీన్ పాల్గొన్నారు.

Must Read
Related News