ePaper
More
    HomeతెలంగాణMP Arvind | బీజేపీ అధిష్టానం నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాం.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌

    MP Arvind | బీజేపీ అధిష్టానం నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాం.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MP Arvind | బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా అధిష్టానం ఎవ‌రినీ ఎంపిక చేసినా తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధ‌ర్మ‌పురి(MP Arvind Dharmapuri) స్ప‌ష్టం చేశారు. అధ్య‌క్షుడిగా ఎవ‌రు ఎన్నికైనా క‌లిసి ప‌ని చేస్తామ‌ని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని బ‌లోపేతం చేయ‌డ‌మే త‌మ క‌ర్త‌వ్య‌మ‌ని చెప్పారు. హైద‌రాబాద్‌(Hyderabad)లోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో అర్వింద్ సోమ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎవ‌రూ నామినేష‌న్ వేసినా మ‌ద్ద‌తిస్తామ‌ని చెప్పారు. అధిష్టానం ఆదేశాల మేర‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎవ‌రూ ఎన్నికైనా అంతా క‌లిసే ప‌ని చేస్తామ‌ని అన్నారు. ఈ విషయంలో రెండో మాటే లేద‌న్నారు.

    MP Arvind | అర్వింద్‌ను కాద‌ని కొత్త వ్య‌క్తికి..

    బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా అర్వింద్ నియ‌మ‌తుల‌వుతార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అధిష్టానం ఆయ‌న పేరును సీరియ‌స్‌గా ప‌రిశ‌లిస్తోందన్న వార్త‌లొచ్చాయి. అర్వింద్‌కు, మ‌రో ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌(MP Eatala Rajender)కు మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. అయితే, బీజేపీ హైక‌మాండ్(BJP Highcommand) అనూహ్యంగా మ‌రో వ్య‌క్తిని తెర‌పైకి తీసుకొచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రాంచంద‌ర్‌రావు(Former MLC Ramchandra Rao) పేరును ఖ‌రారు చేసింది. ఈ నేప‌థ్యంలో అర్వింద్ చిన్న‌బోయార‌న్న వార్త‌లు రాగా, ఆయ‌న వాటిని ఖండించారు. హైకమాండ్ తీసుకునే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటానని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధ్య‌క్షుడిగా ఎవ‌రూ ఎన్నికైనా క‌లిసి ప‌ని చేస్తామ‌న్నారు. రాష్ట్రంలో బీజేపీని బ‌లోపేతం చేయ‌డానికి, పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి చేస్తామ‌ని చెప్పారు.

    READ ALSO  Hyderabad | ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

    Latest articles

    Double Bedroom Houses | దీపావళిలోపు డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లు ఇవ్వాలి

    అక్షరటుడే, ఇందూరు: Double Bedroom Houses |  అర్బన్ నియోజకవర్గంలో దీపావళి (Diwali) లోపు 3,500 ఇళ్లను మంజూరు...

    Flight Missing | రష్యాలో విమానం మిస్సింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Flight Missing | రష్యాలో విమానం మిస్​ అయింది. అంగారా ఎయిర్‌లైన్స్ విమానం(Airlines Plane)...

    Anil Ambani | అనిల్​ అంబానీ సంస్థల్లో ఈడీ సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త అనిల్​ అంబానీకి ఈడీ అధికారులు(ED Officers) షాక్​ ఇచ్చారు....

    Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(global markets) పాజిటివ్‌గా ఉన్నా మన మార్కెట్లు మాత్రం...

    More like this