Homeజిల్లాలునిజామాబాద్​Ex Minsister Mandava | బాధితులకు అండగా ఉంటాం: మాజీ మంత్రి మండవ

Ex Minsister Mandava | బాధితులకు అండగా ఉంటాం: మాజీ మంత్రి మండవ

- Advertisement -

అక్షరటుడే, ధర్పల్లి: Ex Minsister Mandava | వరద నీటి కారణంగా ముత్యాల చెరువు (Mutyala cheruvu) ముంపునకు గురైందని మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు అన్నారు. నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరద ముంపునకు గురైన పలు గ్రామాలను ఆయన ఆదివారం సందర్శించారు.

వరదల కారణంగా ఎంత మేరకు నష్టపోయారనే విషయమై బాధితులను అడిగి తెలుసుకున్నారు. అధికార యంత్రాంగంతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తారాచంద్, మిట్టపల్లి గంగారెడ్డి, లోక్కిడి రాములు, పుప్పాల సుభాష్, సురేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News