అక్షరటుడే, కామారెడ్డి : SC, ST Commission | అత్యాచారానికి గురైన బాధిత మహిళ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. పాల్వంచ మండలం (Palvancha Mandal) ఫరీద్‌పేట గ్రామానికి చెందిన మహిళ అత్యాచారం ఘటన విషయం తెలుసుకున్న ఆయన శనివారం పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో (R&B Guesthouse) బాధిత మహిళను పరామర్శించారు.
ఘటనకు సంబంధించిన వివరాలను కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), గ్రామస్థుల ద్వారా ఆరా తీశారు. బాధితురాలికి పరిహారం అందించడానికి ఉన్న మార్గాలను చూడాలని సూచించారు. బాధితురాలి పిల్లల చదువుకు అండగా నిలిచేలా ప్రభుత్వంతో మాట్లాడతామని పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకున్న జిల్లా పోలీసులను ఛైర్మన్ అభినందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.