అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Municipal Elections | కామారెడ్డి పట్టణంలోని పదో వార్డులో ఉన్న పేద ప్రజలకు అండగా నిలుస్తానని దేవునిపల్లి (Devunipalli) పదో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ (Congress Party Councillor) అభ్యర్థి నీలం కళావతి రమేష్ తెలిపారు. సోమవారం వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
Kamareddy Municipal Elections | ఆప్యాయంగా పలకరిస్తూ..
ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం కళావతి రమేష్ చేతి గుర్తుకు సంబంధించిన ప్లకార్డుతో ప్రచారం చేపట్టారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఓటర్ల సమస్యలను ఓపికగా తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను గెలిస్తే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని, ప్రజా సమస్యలపై గళమెత్తే సత్తా తనకు ఉందని తెలిపారు. విద్యాపరంగా బీకాం, బీఈడీ చేసిన తనకు స్థానిక సమస్యలపై అవగాహన ఉందన్నారు. ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. మరొక మూడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఉంటుందని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సహకారంతో వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులు తెస్తానని పేర్కొన్నారు. తనకు కౌన్సిలర్ అభ్యర్థిగా కాకుండా కుటుంబ సభ్యురాలిగా చూడాలన్నారు. మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
