అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Penti Kalyani Devidas | కార్పొరేటర్‌గా (Corporator) అవకాశమిస్తే ఎల్లవేళలా డివిజన్ ప్రజలకు అండగా ఉంటామని 27వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిని (Congress Candidate) పెంటి కల్యాణి దేవిదాస్ అన్నారు. ఆనంద్‌నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
Penti Kalyani Devidas | డివిజన్ ప్రజలతో మమేకమవుతాం..
ఈ సందర్భంగా డివిజన్లోని ఆనంద్‌నగర్ (Anandnagar) తదితర కాలనీల్లోని ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు తప్పక కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు. కష్టసుఖాలను తెలుసుకుని ముందుకు సాగారు.
Penti Kalyani Devidas | రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున..
రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) పాలన ఉన్నందున డివిజన్‌కు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకునేందుకు శాయాశక్తులా కృషి చేస్తామని ప్రజలకు పెంటి కల్యాణి దేవిదాస్ హామీ ఇచ్చారు. 27వ డివిజన్‌ను అన్నివిధాలా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పాటుపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
