అక్షరటుడే, నిజాంసాగర్: Minister Komatireddy | సీనియర్ జర్నలిస్ట్ జీడిపల్లి దత్తురెడ్డి (Journalist Jeedipally Dattureddy) కుటుంబానికి అండగా ఉంటామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పిట్లం(Pitlam mandal) మండలం మద్దెల చెరువు (Maddela Cheruvu) గ్రామానికి చెందిన దత్తురెడ్డి (37) ఇటీవల గుండెపోటుతో మరణించారు.
దీంతో ఆయన స్వగ్రామమైన మద్దెలచెరువు గ్రామానికి సోమవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లి దత్తురెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దత్తురెడ్డి భార్య, తల్లిని ఓదార్చారు. జర్నలిస్ట్‌గా దత్తురెడ్డి విశేష సేవలు అందించారన్నారు. నల్లగొండలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన జిల్లా అభివృద్ధికి తన కథనాల ద్వారా ఎంతో సహకారం అందించారన్నారు.
ఈ సందర్బంగా దత్తురెడ్డి భార్య ప్రియాంకకు ఔట్ సోర్సింగ్ (Outsourcing) ఇద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రూ.4 లక్షల ఆర్థికసాయం అందించారు. మంత్రి వెంట జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డి తదితరులు ఉన్నారు.
Minister Komatireddy | గుత్తా పరామర్శ, ఆర్థికసాయం..
సీనియర్ జర్నలిస్ట్ జీడిపల్లి దత్తురెడ్డి కుటుంబ సభ్యులకు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఫోన్లో దత్తురెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేశారు.