అక్షరటుడే, వెబ్‌డెస్క్: Constable Soumya | నిజామాబాద్ (Nizamabad)లో గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarasimha) సోమవారం ఉదయం పరామర్శించారు. సౌమ్య హెల్త్ కండీషన్‌ను నిమ్స్ డైరెక్టర్ బీరప్ప (NIMS Director Beerappa), ఇతర వైద్యులు మంత్రికి వివరించారు.
మంత్రి మాట్లాడుతూ.. సౌమ్యకు ఇలా జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ధైర్యంగా ఉండాలని, సౌమ్య పూర్తిగా కోలుకుంటుందన్నారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. సౌమ్య పూర్తిగా కోలుకునే వరకూ మెరుగైన వైద్య సేవలు (Medical Services) అందించే బాధ్యత తమదేనని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎక్సైజ్, పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లో జరిగిన ఘటన దురదృష్టకరన్నారు. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరినీ చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
Constable Soumya | విషమంగానే పరిస్థితి
సౌమ్య ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే మెరుగైనప్పటికీ, ఇంకా ఆమె కండీషన్ క్రిటికల్‌గానే ఉందని మంత్రి తెలిపారు. నిమ్స్‌లో సీనియర్ వైద్యుల బృందం ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. సౌమ్య సంపూర్ణంగా కోలుకుటుందని ఆశించారు. ఆమె కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. నిందితులపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.