59
అక్షరటుడే, వెబ్డెస్క్: Minister Thummala | పామాయిల్ సాగులో దేశంలోనే తెలంగాణ ముందుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Minister Thummala Nageswara Rao) అన్నారు. నిజామాబాద్ జిల్లా బర్ధిపూర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పామాయిల్ సాగులో నిజామాబాద్ జిల్లాను ముందుంచుతామని తెలిపారు.
ఈ జిల్లాలోనూ త్వరలో పామాయిల్ ఫ్యాక్టరీలు (palm oil factories) నిర్మిస్తామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేశామన్నారు. సన్న ధాన్యం పండించిన రైతాంగానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు.