ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMinister Ponguleti | అతిత్వరలోనే వీఆర్​ఏ, వీఆర్​వో వ్యవస్థ

    Minister Ponguleti | అతిత్వరలోనే వీఆర్​ఏ, వీఆర్​వో వ్యవస్థ

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి:Minister Ponguleti | రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజుల్లో వీఆర్​ఏ(VRA), వీఆర్​వో(VRO) వ్యవస్థను తిరిగి తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. ఎల్లారెడ్డిలోని షెట్​పల్లిలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. భూభారతి(Bhubharati) చట్టంలో తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,956 రెవెన్యూ గ్రామాలకు అధికారులను పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. 380 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, 6వేల సర్వేయర్ల పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ప్రణాళిక వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

    Minister Ponguleti | ఎవరైనా తప్పుచేస్తే..

    తహశీల్దార్​ స్థాయి నుంచి కలెక్టర్​ వరకు భూవివాదాలకు సంబంధించి ఎవరు తప్పు చేసినా శిక్షించే విధంగా భూభారతి చట్టం రూపొందించబడి ఉందన్నారు. యువవికాసం(Yuva Vikasam) కింద ప్రతి నియొజకవర్గం నుంచి 3 వేల నుంచి 4వేల వరకు యువతకు సాయం చేసేలా ప్రణాళిక వేశామన్నారు. రాబోయే నాలుగేళ్లలో 20లక్షల ఇళ్లు కట్టించే విధంగా చూస్తామన్నారు. అర్హులైన పేదలు ప్రభుత్వ భూమి తరాల నుంచి సాగు చేసుకుంటుంటే.. వారికి చట్టబద్ధంగా పాస్​బుక్​లు ఇచ్చేవిధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...