అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ: ATM Robbery | నగరంలోని పలు ఏటీఎంలలో చోరీలకు పాల్పడ్డ నిందితులను త్వరలోనే పట్టుకుంటామని..నగదు రికవరీ చేస్తామని ఇన్‌ఛార్జి సీపీ రాజేష్ చంద్ర(In-charge CP Rajesh Chandra) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నగరంలోని చోరీకి గురైన రెండు ఏటీఎంలను తనిఖీ చేశారు.
ATM Robbery | తెల్లవారుజామున ఏటీఎంలలోకి చొరబడి..
నగరంలో తెల్లవారుజామున నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాంగ్రా బ్రాంచ్‌కు సంబంధించిన డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ఏటీఎంను, ఐదవ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రెండిండిటోనూ కలిపి సుమారు రూ. 30లక్షల వరకు దోచుకెళ్లారు.
ATM Robbery | ఏటీఎంలను పరిశీలించిన ఇన్‌ఛార్జి సీపీ
ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర ధ్వంసమైన ఏటీఎంలను శనివారం ఉదయం పరిశీలించారు. చోరీ జరిగిన విధానం, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను అధ్యయనం చేశారు. సీసీటీవీ ఫుటేజీ(CCTV footage) సేకరణ, ఏటీఎం లోపలి, పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలను సేకరించి విశ్లేషణకు ఆదేశించారు.
ATM Robbery | ప్రత్యేక బృందాల ఏర్పాటు..
ఏటీఎంల చోరీ నిందితులను పట్టుకునేందుకు క్లూస్ టీమ్(Clues Team), సాంకేతిక నిపుణులు, స్థానిక పోలీస్స్టేషన్ల సిబ్బందితో కలిపి 5 ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ముఖ్యంగా ఏటీఎంలు, బ్యాంకులు, జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మొబైల్ పెట్రోలింగ్ పెంచాలని ఇన్‌ఛార్జి సీపీ ఆదేశించారు. జిల్లాలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.
ATM Theft | బ్యాంకులతో సమన్వయం..
ఏటీఎం భద్రతను బలోపేతం చేయడానికి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసుకొని అలారం వ్యవస్థలు, అదనపు సీసీటీవీలు, లైటింగ్ మెరుగుదలపై ఇన్‌ఛార్జి సీపీ పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీస్‌శాఖ (Police Department) అప్రమత్తంగా ఉందని ప్రజలకు భరోసా కల్పించారు. నిందితుల గుర్తింపు, పట్టుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల ద్వారా నగరంలో ఏటీఎంలు, బ్యాంకుల భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి (Additional DCP Baswa Reddy), నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, నాల్గో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీష్ కుమార్, టౌన్ సీఐ శ్రీనివాస్‌రాజ్, నాల్గో టౌన్ ఎస్సై గంగాధర్, బ్యాంక్ మేనేజర్ శివకుమార్ తదితరులు ఉన్నారు.

