అక్షరటుడే, ఆర్మూర్: Manala Mohan reddy | ఉపాధి కూలీ(Employed Laborers)ల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి(Manala Mohan Reddy) అన్నారు. వేల్పూర్ మండలం రామన్నపేట్లో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మానాల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కూలీల సమస్యలను తెలుసుకుని అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామని వివరించారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వ పథకాలు(Government schemes) ప్రజలు అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో వేల్పూర్ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్, వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్, వేల్పూర్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ భూమా రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆత్మరాం, అక్లూరు, రామన్నపేట్ గ్రామ శాఖల అధ్యక్షులు మల్లారెడ్డి, పొన్నాల చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.