అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pawan Kalyan | కొబ్బరి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లాలో బుధవారం ఆయన పర్యటించారు. కేశనపల్లి (Keshanapalli)లో కొబ్బరి చెట్లను పరిశీలించారు.
సముద్ర జలాలలో లక్షలాది కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో పవన్ (Pawan Kalyan) రైతులతో మాట్లాడారు. ఉప్పు నీటితో కొబ్బరి చెట్లు చనిపోతున్నా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కోనసీమ కొబ్బరి రైతులకు (Konaseema Coconut Farmers) శాశ్వత పరిష్కారం కావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో జరిగిన తప్పులను తమ ప్రభుత్వంలో సరిదిద్దుతోందని చెప్పారు.తాను కోనసీమ రైతుల గొంతునవుతానని పవన్ అన్నారు.
అన్నదాతల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికే పర్యటనకు వచ్చానని చెప్పారు. శంకరగుప్తం డ్రైన్తో తాగునీటి జలాలు ఉప్పగా మారాయన్నారు. డ్రైన్ ఆధునికీకరణకు రూ.4 వేలు కోట్లు అవసరం అని ఆయన పేర్కొన్నారు. కొందరు రైతులు తనను సినిమా తీసి డబ్బులు ఇవ్వమంటున్నారని పవన్ చెప్పారు. అయితే డబ్బులు ఎవరి జేబులో నుంచి ఇచ్చేవి కావన్నారు. ఉన్న డబ్బంతా పథకాలకు ఖర్చు చేసేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కోనసీమ జిల్లా రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డిసెంబర్లో మరోసారి పర్యటిస్తానని చెప్పారు.