HomeతెలంగాణMla Sudarshan Reddy | ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరిస్తాం

Mla Sudarshan Reddy | ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరిస్తాం

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Mla Sudarshan Reddy | పట్టణంలోని ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రి(Government General Hospital)లో సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి(MLA Sudarshan Reddy) తెలిపారు. ఆస్పత్రిలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. హాస్పిటల్​లో ప్రతినెలా 50వేల మంది రోగులకు చికిత్సలు అందిస్తున్నారని వివరించారు. అలాగే ప్రతినెలా 117 మంది గర్భిణులకు డెలివరీలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగకరమైన సేవలను మెరుగు పర్చాలని వైద్యులకు సూచించారు. సమీక్షలో ఆస్పత్రి వైద్యులు(Hospital Doctors) తదితరులున్నారు.

విద్యకే మొదటి ప్రాధాన్యత

కాంగ్రెస్​ ప్రభుత్వం విద్యకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణంలోని గ్రంథాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు కంప్యూటర్లను ఆయన ప్రారంభించారు. అనంతరం పాఠకులతో మాట్లాడారు. లైబ్రరీలలో సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. పోటీపరీక్షలకు శ్రద్ధతో సన్నద్ధం కావాలని సూచించారు.