అక్షరటుడే, ఇందూరు : Samala Prasanna Satyapal | బీజేపీ సహకారంతో 48వ డివిజన్‌ను అభివృద్ధి చేస్తామని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని (BJP Corporator Candidate) సామల ప్రసన్న సత్యపాల్ అన్నారు. ఈ మేరకు గురువారం జెండాగల్లీ (Jandagalli), కోటగల్లీ (Kotagalli)లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Samala Prasanna Satyapal | ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సహకారంతో..
ఈ సందర్భంగా సామల ప్రసన్న సత్యపాల్ మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind), అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) సహకారంతో డివిజన్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తామని తెలిపారు. రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీజేపీ నేతలు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
Samala Prasanna Satyapal | 48వ డివిజన్లో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు..
కార్పొరేటర్‌గా గెలిపిస్తే డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఉన్న సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే ప్రజాసేవకు పూర్తిగా అంకితమవుతానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తానన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం (BJP Government) అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు విస్తృత లబ్ధి చేకూరుతోందని ఆమె తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు పక్కా ఇళ్లు, ఉజ్వల యోజన కింద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందుతున్నాయని చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, డివిజన్లో విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.