HomeUncategorizedAir Force | మేఘంలా గర్జిస్తాం.. మరో వీడియో పోస్ట్​ చేసిన ఎయిర్​ ఫోర్స్

Air Force | మేఘంలా గర్జిస్తాం.. మరో వీడియో పోస్ట్​ చేసిన ఎయిర్​ ఫోర్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air Force | ఆపరేషన్​ సిందూర్​ operation sindoor తో భారత్​ bhart తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. పాక్​లోని ఉగ్ర స్థావరాలను terror camps ఖచ్చితత్వంతో చేధించింది. అనంతరం పాక్​ దాడులను భారత ఆర్మీ తిప్పికొట్టింది.

ఈ ఆపరేషన్​లో భారత త్రివిద దళాలు సమన్వయంతో పని చేశాయి. పాక్​ డ్రోన్లతో దాడులకు తెగబడగా.. వాటిని అడ్డుకోవడంతో పాటు దాయాది దేశంలోని ఎయిర్​బేస్​లను pak airbase ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్ indian air force​ ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత వైమానికి దళం మరో వీడియోను ఎక్స్​లో పోస్ట్​ చేసింది.

ఆపరేషన్​ సిందూర్​లో భాగంగా చేపట్టిన పలు కార్యక్రమాలను భారత వైమానిక దళం ఎక్స్​ వేదికగా పంచుకుంటోంది. తాజాగా ఆపరేషన్​లో భాగంగా చేపట్టిన ఓ వీడియోను పోస్ట్​ చేసింది. ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో స్పందిస్తాం అంటూ వీడియో విడుదల చేసింది. దేశ రక్షణ సమయంలో తేడా వస్తే మేఘంలా గర్జిస్తాం అని చాటిచెప్పేలా ఉన్న ఆ దృశ్యాలు గూస్​బంప్స్​ తెప్పిస్తున్నాయి. వైమానిక దళం ఎలా ప్రతిస్పందిస్తుంది.. ఎలాంటి యాక్షన్​ తీసుకుంటుంది.. తదితర దృశ్యాలతో ఆ వీడియోను రూపొందించారు. పీపుల్​ ఫస్ట్​.. మిషన్​ అల్వేస్​ నినాదంతో వీడియో మొదలైంది.