HomeతెలంగాణRiyaz Encounter | రియాజ్​ దాడిలో గాయపడిన ఆసిఫ్​కు గ్యాలంట్రీ మెడల్ కోసం సిఫార్సు చేస్తాం...

Riyaz Encounter | రియాజ్​ దాడిలో గాయపడిన ఆసిఫ్​కు గ్యాలంట్రీ మెడల్ కోసం సిఫార్సు చేస్తాం : డీజీపీ

Riyaz Encounter | రియాజ్​ దాడిలో గాయపడి హైదరాబాద్​లో చికిత్స పొందుతున్న ఆసిఫ్​ను డీజీపీ శివధర్​రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Riyaz Encounter | కానిస్టేబుల్​ హత్య కేసు నిందితుడు రియాజ్​ దాడిలో గాయపడిన ఆసిఫ్​ను డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivadhar Reddy) మంగళవారం పరామర్శించారు. ఆయన పేరును గ్యాలంట్రీ మెడల్​ (Gallantry Medal​) కోసం సిఫార్సు చేస్తామని తెలిపారు.

కానిస్టేబుల్​ ప్రమోద్​ను హత్య చేసిన అనంతరం రియాజ్​ పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించారు. ఈ క్రమంలో  పోలీసులు పట్టుకునే క్రమంలో రియాజ్ మళ్లీ దాడి చేసి పారిపోయే యత్నం చేశాడు. ఆ సమయంలో ఆసిఫ్​ ధైర్య సాహసాలు ప్రదర్శించి రియాజ్​ను పట్టుకోవడానికి యత్నించాడు. అయితే నిందితుడు ఆసిఫ్​పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయన ప్రస్తుతం నాంపల్లిలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆసిఫ్​ను డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) పరామర్శించారు.

Riyaz Encounter | వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది

ఆసిఫ్‌ ఆరోగ్య పరిస్థితిపై డీజీపీ ఆరా తీశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డీజీపీ తెలిపారు. ఆయన వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఆసిఫ్ ధైర్యసాహసాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి గ్యాలంట్రీ మెడల్ కోసం సిఫార్సు చేస్తామని డీజీపీ తెలిపారు.

Riyaz Encounter | తీవ్ర గాయాలు

రియాజ్‌ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు చేతులపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. లోతైన కత్తిగాట్లు కావడంతో బాధితుడిని హైదరాబాద్‌కి తరలించారు. ఆసిఫ్‌కు చేతి నరాలు కట్‌ అయినట్టు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు శస్త్ర చికిత్స జరగడంతో కోలుకుంటున్నట్లు చెప్పారు. కాగా కానిస్టేబుల్​ను హత్య చేసిన రియాజ్​ను పట్టుకున్న తర్వాత జీజీహెచ్​లో చికిత్స అందిస్తుండగా.. పోలీసుల తుపాకీ లాక్కొని పారిపోయే యత్నం చేశాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో నిందితుడు చనిపోయిన విషయం తెలిసిందే.