అక్షరటుడే నిజామాబాద్ సిటీ : MLA Sudarshan Reddy | నిరుద్యోగ యువతలో నైపుణ్యాన్ని మెరుగుపర్చే విధంగా వారికి ప్రత్యేక శిక్షణనిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న ఐటీ హబ్ (IT Hub)ను ఆయన సందర్శించారు.
MLA Sudarshan Reddy | పలు ఐటీ కంపెనీలతో సమావేశం..
పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సోమవారం సుదర్శన్‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఐటీ హబ్‌లో ఉగ్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. బీటెక్ పూర్తి చేసుకున్న వారికోసం ఐటీ హబ్‌లో ప్రత్యేక శిక్షణ (Special Training) ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కోసం పెద్ద నగరాలకు వెళ్లి అనవసరంగా ఖర్చులు పెంచుకోవద్దని ఆయన యువతకు సూచించారు. చాలీచాలని జీతాలతో యువత ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారని.. ఇకనుంచి నైపుణ్యత కలిగిన యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
ఉచిత శిక్షణ ద్వారా ఐటీ ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఐటీరంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కార్పొరేషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా ఛైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ నాయకులు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay), ఇతర ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

సుదర్శన్ రెడ్డి చొరవతో..
కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్, డిస్టిక్ట్ సెక్యురిటీ కౌన్సిల్ మెంబర్ రజనీకాంత్ మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి జిల్లాకు పెద్ది దిక్కు అని పేర్కొన్నారు. గతంలో ఆయన హయాంలోనే మెడికల్ కాలేజీ మంజూరైందన్నారు. ఆయన చొరవతో జిల్లాలో వైద్య రంగం అభివృద్ధి చెందిందన్నారు. అలాగే ఇంజినీరింగ్ కళాశాల మంజూరు కావడంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. ఐటీ హబ్‌లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సుదర్శన్ రెడ్డి కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు. ఆయన చొరవతో జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు.