ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి కల్పిస్తామని వైస్​ఛాన్స్​లర్​ యాదగిరి రావు (Vice Chancellor Yadagiri Rao) పేర్కొన్నారు. ఈ మేరకు ఇంజినీరింగ్ కళాశాల సెమినార్ హాల్​లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కళాశాల (Engineering College) ఏర్పాటు అనేది ఎన్నో ఏళ్ల కల అని అన్నారు. ఈ ప్రాంతంలోని విద్యార్థులకు ఉచితంగా ఇంజినీరింగ్​ విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం తెయూ కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కళాశాలలో సాంకేతికపరమైన బోధనా పద్ధతులతో నాణ్యమైన విద్యను అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

    ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసిన సీఎం రేవంత్​రెడ్డికి (CM Revanth reddy) అందుకు కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC Cheif Mahesh Goud), షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు ఈ సందర్భంగా వేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు నందిని, అతిక్ సుల్తాన్ గోరి, భ్రమరాంబిక, నీలిమ, ఇంజినీరింగ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

    More like this

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని...

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...