అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ శుక్రవారం ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ, ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. బెంగళూరులో నిర్వహించిన ఓటు అధికార్ ర్యాలీ కార్యక్రమం(Voter Registration Rally Program)లో పాల్గొన్న రాహుల్ ఈసీపై మరోసారి ఆరోపణలు చేశారు.
స్పష్టమైన ఆధారాలు ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలని, లేకపోతే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈసీ (Election Commission) సవాల్ విసిరిన తరుణంలో రాహుల్ స్పందించారు. “రాజ్యాంగంపై దాడి చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మేము మిమ్మల్ని ఒక్కొక్కటిగా పట్టుకుంటాము. దీనికి సమయం పడుతుంది. కానీ మేము పట్టుకుంటామని” పేర్కొన్నారు. కాషాయ పార్టీ సిద్ధాంతం రాజ్యాంగానికి విరుద్ధమన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుందని తెలిపారు. రాజ్యాంగంపై దాడి చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు. మీరు చేస్తున్న తప్పులను ఒక్కొక్కటిగా పట్టుకుంటామని తెలిపారు.
Rahul Gandhi | ఎన్నికల సంఘం వివరాలు ఎందుకివ్వరు..
ఓటర్ జాబితా, పోలింగ్ వివరాలు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వడం లేదని రాహుల్‌గాంధీ (Rahul Gnadhi) ప్రశ్నించారు. “ఎన్నికల కమిషన్ ఒక విషయం అర్థం చేసుకోవాలి.. మీరు మాకు డేటాను అందించకపోయినా ఎన్నిరోజులో దాచలేరు. మేము ఈ పనిని కేవలం ఒక సీటు కోసం కాదు, 10-15 సీట్ల కోసం చేయగలము.. మీరు దాచలేరు. ఏదో ఒక రోజు, మీరు ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని అన్నారు. “భారత ఎన్నికల సంఘం గత 10 సంవత్సరాల ఓటర్ల జాబితాలు, వీడియో రికార్డింగ్‌లను వెంటనే మాకు ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఓటు ట్యాంపరింగ్ జరిగిందని మరోసారి ఆరోపించారు.
“రాజ్యాంగంపై (Constitution) దాడి చేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎప్పటికైనా మీరు తప్పించుకోగలేరు. మళ్లీ ఆలోచించండి” అని ఎన్నికల కమిషన్‌కు బలమైన సందేశాన్ని ఇచ్చారు. “మేము మిమ్మల్ని ఒక్కొక్కటిగా జవాబుదారీగా ఉంచుతాము. దీనికి సమయం పట్టవచ్చు, కానీ మేము దానిని చేస్తాము” అని ఆయన అన్నారు.
Rahul Gandhi | కుట్ర పన్ని..
గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికల్లో (Maharashtra Elections) ఒకే సీటు గెలవడానికి 1.02 లక్షల ఓట్లను దొంగిలించడానికి ఈసీ, బీజేపీ (BJP) కుట్ర పన్నాయని రాహుల్ ఆరోపించారు. “రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కును ఇస్తుంది.. కానీ, గత ఎన్నికల్లో, మన ముందు ఒక ప్రశ్న తలెత్తింది. మహారాష్ట్రలో భారత కూటమి లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) గెలిచింది కానీ, నాలుగు నెలల తర్వాత బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది.. ఇది దిగ్భ్రాంతికరమైనది” అని రాహుల్ పేర్కొన్నారు.